**మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు**
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు
దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరగాలని, బహిరంగ బ్యాలెట్ విధానంలో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహించాలని ఆదేశించింది అంతేగాక.. బలపరీక్ష మొత్తం వీడియో తీయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
Comments
Post a Comment