**'ఆపరేషన్ అతిరహస్య':* *
*'ఆపరేషన్ అతిరహస్య':*
*రాజకీయాల్లోను, యుద్ధరంగంలోను* *ఎత్తుగడలు,* *వ్యూహాలు ప్రతివ్యూహాలు* *అనూహ్యంగానే ఉంటాయి* *ఉండాలి కూడా...* *అని చాణక్యుడు* *ఎప్పుడో చెప్పాడు*
. కానీ దానిలో అతిరహస్యం అన్నదే కీలక పాత్ర పోషిస్తోంది. చేసేది మంచికైనా, చెడుకైనా గోప్యతను పాటిస్తే అంత ఫలితం ఉంటుంది. సరిగ్గా మహారాష్ట్ర విషయంలో అదే జరిగింది. ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఉదయం 8 గంటలు దాటాక ప్రమాణ స్వీకారం ప్రారంభం అయ్యాక మాత్రమే మొత్తం స్థానిక, జాతీయ మీడియాకి ఈ సమాచారం బయటకు పొక్కింది. అంతవరకు ఎవరికీ నామమాత్రంగా కూడా ఈ హఠాత్పరిణామం గురించి తెలియక పోవడం ఇక్కడ ముఖ్య అంశాం. సాధారణంగా తెల్లవారు 3 గంటల వరకు పత్రికలకు వార్తలు ప్రచురించడానికి డెడ్ లైన్ ఉంటుంది. ఆ లోపు ఒక వేళ సంచలన వార్త చిన్నపాటి ఆధారం అందినా చిన్న స్పేస్ లోనైనా ప్రచురించడం అనేక సందర్భాల్లో చూసాం. కాని మహారాష్ట్ర పరిణామం విషయంలో మాత్రం మీడియా కి కనీసం ఉప్పు కూడా అందలేదంటే ప్రణాళిక ఎంత పగడ్బందీగా జరిగిందో అర్థం అవుతుంది. పెద్ద పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తో పాటు ఆంగ్ల ప్రత్రికలు, ఇతర మీడియా అంతా ఉదయాన్నే పతాక శీర్షికలన్నీ మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అని మాత్రమే కనబడ్డాయి. ఉదయం ఎనిమిదిన్నరకు టీవీ న్యూస్ చూస్తున్న వారు ఒక్క సారిగా ఫడ్నవీస్ వార్త చూసి అవాక్కయ్యారు. ఠాక్రే ముఖ్యమంత్రి అని వార్తాపత్రికల్లో ఒక పక్క చదువుతూనే మరో పక్క టీవీ ఛానెళ్లలో ఫడ్నవీస్ ప్రమాణం చేయడం చూసి అంతా ఖంగు తిన్నారు. ముఖ్యమంత్రి అయిపోయాననే కలలలో తేలియాడుతున్న ఉద్ధవ్, శివసైనికులు ఉదయం నిద్ర లేచేసరికే అంత అయిపొయింది. బలపరీక్ష వంటి ఇతర అంశాలు తర్వాత విషయం.
*బీజేపీ సారధులు నరేంద్ర* *మోడీ, అమిత్ షా, నడ్డా .. విరచిత* " *ఆపరేషన్ అతిరహస్య "* *కళ్ళు తెరిచి చూసే లోగా* *అమలయిపోయింది. సర్జికల్ స్ట్రైక్* *అనుభవం ఉంది కదా...!*
Comments
Post a Comment