శంషాబాద్ లో మరో దారుణం
*శంషాబాద్‌లో మరో దారుణం: పెట్రోల్ పోసి యువతిని చంపిన దుండగులు*
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిద్దులగుట్ట రోడ్డులోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఘటన జరిగింది.
అత్యంత దారుణంగా యువతిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు దుండగులు. పూర్తిగా డెడ్ బాడీ కాలిపోయినట్లు తెలుస్తుంది. మహిళను హత్య చేసి కాల్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంకను చంపి 24గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మహిళ హత్య కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. నిత్యం పూజలు జరిగే స్థలంలోనే ఈ ఘటన జరిగింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. చట్టుపక్కల ప్రాంతాల్లో అణువు అణువు గాలిస్తున్నారు. టెంపుల్ పరిసర ప్రాంతంలోనే రోడ్ పక్కనే ఘటన జరిగింది. ప్రైమరీ ఎవిడెన్స్ సేకరించారు పోలీసులు. గోడ పక్కనే అమ్మాయి హత్య జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గంటా రెండు గంటల క్రితమే ఘటన జరిగి ఉండవచ్చునని అంటున్నారు పోలీసులు. అత్యాచారం చేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Comments
Post a Comment