**బ్లాంకెట్‌లో మృతదేహాన్ని చుట్టి నిప్పు పెట్టి తగలబెట్టారన్నారు సీపీ సజ్జనార్**

హైదరాబాద్:  వైద్యురాలి హత్యకేసులో  ఏ1 లారీ డ్రైవర్‌ ఆరిఫ్‌ (26), ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. లారీలో ఇనుము అన్‌లోడ్ చేయకపోవడంతో టోల్‌గేట్ దగ్గరే లారీ పార్క్ చేశారన్నారు. తొండుపల్లి దగ్గర యువతి స్కూటీ పార్క్ చేయడం లారీ వాళ్లు చూసినట్లు చెప్పారు. మళ్లీ ఆమె వస్తుందని నిందితులు మాట్లాడుకుని కుట్ర పన్నినట్లు వెల్లడించారు. నవీన్‌ స్కేటీ బ్యాక్ టైర్‌లో గాలి తీసేయాలని ప్లాన్‌ చేశాడన్నారు. రా. 9.13కి గచ్చిబౌలి నుంచి ప్రియాంక రిటర్న్ వచ్చిందన్నారు. ఆమె రాగానే పంక్చర్‌ అయిందని వారు చెప్పారని తెలిపారు. పంక్చర్‌ చేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసిందన్నారు. పంక్చర్‌ వేయిస్తామని ఇద్దరూ స్కూటీ తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్కూటీకి గాలి కొట్టించి వాపస్ వచ్చేశారన్నారు.
 
అత్యాచారం సమయంలో యువతి నోరు మూసేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రియాంక చనిపోయిందన్నారు. శివ, నవీన్‌ టూవీలర్‌ నడిపినట్లు చెప్పారు. మిగతా ఇద్దరూ లారీ నడిపించారని వివరించారు. ఇండియన్‌ ఆయిల్‌ బంకులో పెట్రోల్ తీసుకున్నారన్నారు. షాద్‌నగర్‌ దగ్గర యూటర్న్‌ తీసుకున్నారన్నారు. బ్లాంకెట్‌లో మృతదేహాన్ని చుట్టి నిప్పు పెట్టి తగలబెట్టారన్నారు. డెడ్‌ బాడీ కాలిందా? లేదా? అని మళ్లీ వెళ్లి చూశారన్నారు. తర్వాత ఆరాంఘర్‌ చేరుకొని... లారీ అన్‌లోడ్ చేసి ఎక్కడి వాళ్లు అక్కడికి పోయారని తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్