**ఒకేసారి వేరు వేరు ఫోన్లలో వాట్సాప్  లాగిన్**


ఒకేసారి వేరు వేరు ఫోన్లలో వాట్సాప్  లాగిన్


ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఎన్నో రోజులుగా యూజర్స్ నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా ఈ సరికొత్త ఫీచర్‌ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్లో మాత్రమే వాట్సాప్‌ లాగిన్ కాగలం. వేరొక ఫోన్లో లాగిన్‌ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టర్‌ అయిన ఫోన్లో నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ ఫోన్లో లాగిన్‌ అవటం సాధ్యపడదు. అయితే మరికొద్ది వారాలలో ఒకేసారి వేర్వేరు ఫోన్లోలో లాగిన్‌ అవ్వగలిగే ఫీచర్‌ని వాట్సాప్‌ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. పరీక్షల దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. దీనితో పాటుగా డార్క్‌మోడ్‌ ఫీచర్‌ని తీసుకు రానున్నారు. 


ఇవి కాకుండా మరి కొన్ని సరికొత్త ఫీచర్స్‌ని కూడా వాట్సాప్‌ అందుబాటులోకి తేనుంది. ఇప్పటి వరకు ఐఫోన్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌ను ఇకముందు ఐపాడ్‌లలో వినియోగించుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ కల్పించనుంది. యూపీఐ ఆధారంగా పనిచేసే వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నారు. గత ఫిభ్రవరిలోనే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ని పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినప్పటికి అధికారికంగా మాత్రం ఇంకా విడుదలచేయలేదు. అయితే వాట్సాప్‌ ఈ చెల్లింపుల విధానానికి ఆర్‌బీఐ నుంచి అనుమతిపొందవలసి ఉంది. అంతేకాకుండా గ్రూప్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా కొత్త ఫీచర్‌ని తేనుందని టెక్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దీనిలో ఉన్న బ్లాక్‌లిస్ట్‌ సహాయంతో గ్రూప్‌లో చేరమని ఇన్విటేషన్ రిక్వెస్ట్‌ పంపే వారిని బ్లాక్‌ చేయవచ్చు. అయితే ముందుగా ఈ ఫీచర్‌ని ఐఫోన్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి తేనున్నారట.        


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్