**బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్**
*బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ సర్కార్*
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరింది.
Comments
Post a Comment