**వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదు : అదనపు ఎస్పీ నర్మద**
*వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదు : అదనపు ఎస్పీ నర్మద*
- - లేజర్ స్పీడ్ గన్లతో చలనాల ద్వారా వేగ నియంత్రణ
- - స్పీడ్ గన్ల వినియోగంతో తగ్గనున్న ప్రమాదాల సంఖ్య
నల్గొండ : రహదారులపై వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదని జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు.
బుధవారం నల్గొండ పట్టణంలోని నార్కట్ పల్లి - అద్దంకి రహదారి పై లెప్రసి కాలనీ వద్ద స్పీడ్ గన్ పనితీరు, చాలన్స్ విధిస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకునే క్రమంలో అతి వేగంతో వెళ్లకుండా వారికి హెచ్చరికలు చేయడం, రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా వారిని రక్షించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని చెప్పారు. జిల్లాకు కేటాయించిన రెండు స్పీడ్ గన్స్ ద్వారా నిత్యం వాహనాల వేగానికి కళ్లెం వేసే విధంగా స్పీడ్ గన్స్ ద్వారా చాలన్లు విధిస్తున్నామని ఆమె వివరించారు. జులై నెల నుండి నేటి వరకు జిల్లాలో స్పీడ్ గన్స్ ద్వారా కోటి యాభై లక్షల జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు. రోడ్ ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులలో స్పీడ్ గన్స్ వినియోగించడంతో పాటు ఈ చాలన్ అమలు విధానంతో ప్రమాదాలను తగ్గించడం, వాహన దారులంతా నిబంధనలు పాటించే విధంగా కృషి చేస్తుందని ఆమె వివరించారు. అతి వేగం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్న క్రమంలో ఒక స్పీడ్ గన్ జాతీయ రహాదారి పైన. మరొకటి స్థానిక పట్టణాలలో సమర్ధవంతంగా వినియోగిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ రహదారులపై 80 కిలో మీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 30 కిలో మీటర్ల వేగంతోనే వాహనాలను నడపాలని నిబంధన ఉన్నా ఎవరూ వాటిని పాటించక పోవడం కారణంగానే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులంతా నిబంధనలు పాటించే విధంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అమె వెంట ట్రాఫిక్ సిఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Post a Comment