ప్రియాంక రెడ్డి పై అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసిన సంఘటన నీ నిరసిస్తూ మౌన ప్రదర్శన
ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసిన సంఘటన నీ నిరసిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన నిందితులను కఠినంగా శిక్షించడం తో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.కార్యక్రమం లో బార్ అసోసియేషన్ కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్,ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం , దేవేందర్, మాజీ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజి రెడ్డి , కొండారెడ్డి ,న్యాయవాదులు హనీఫ్ ఖాన్ , రాజకుమార్ , అమర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment