**ప్రేమజంట బలవన్మరణం**
*ప్రేమజంట బలవన్మరణం*
కరీంనగర్ జిల్లా:
సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దుద్దనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ వీరాసింగ్ (25), ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన
లయమాధురి (19) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడం వల్ల పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు.
శుక్రవారం దుద్దనపల్లి గ్రామంలో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగారు.
ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు.
Comments
Post a Comment