ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్
నేడు కెసిఆర్ “దీక్షా దివస్ “ ను నల్లగొండ నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఘనంగా నల్లగొండలో నిర్వహించారు. ఈ సందర్బముగా మొదట నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయములో కెసిఆర్ చిత్ర పటానికి “ క్షీరాభిషేకం” చేశారు. తరువాత ఎన్ జి కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు సమర్పించినారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బముగా నాయకులు మాట్లాడుతూ నాడు కెసిఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొనివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి పిత కెసిఆర్ అని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తూ సంబండ వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ దేశంలేనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నారని, కాళేశ్వరం, యాదగిరి క్షేత్రం, రాష్ట్రానికి తలమానికం కాబోతున్నాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం కెసిఆర్ ప్రకటించిన విధానం వారిని సంతృప్తి పరిచయన్నారు.
ఈ కార్యక్రమాలలో నల్లగొండ సూర్యాపేట జిల్లాల స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మాలె శరణ్యా రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రేఖల భద్రాద్రి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలీ,బొర్ర సుధాకర్, సుంకరి మల్లేశ్ గౌడ్,జాన్ శాస్త్రీ పట్టణ అధ్యక్షులు అబ్బగొని రమేష్, పిల్లి రామరాజు, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు అయితగొని యాదయ్య,సింగం రామ్ మోహన్ , మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్ , దుబ్బ అశోక్ సుందర్,బొంత శ్రీను, రావుల శ్రీనివాస్ రెడ్డి దండె o పల్లి సత్య న్న , గున్ రెడ్డి యుగం ద ర్ రెడ్డి ఖయ్యుమ్ బేగ్, సమి, లతీఫ్ పున్న గణేష్ దొడ్డి రమేష్,బాషపాక హరికృష్ణ, మోహన్ బాబు, మహమ్మద్ జాన్, షరీఫ్, సింగం లక్ష్మి, కొండ్ర స్వరూప, బొబ్బిలి స్వరూప రెడ్డి, భాస్కర్ గౌడ్,దోటి శ్రీనివాస్ ధోనాల నాగార్జున రెడ్డి యాదయ్య మార్త వెంకన్న రామకృష్ణ మాండ్ర వెంకన్న తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment