**ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరమార్శించిన గవర్నర్ తమిళిసై**
*ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరమార్శించిన గవర్నర్ తమిళిసై*
దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై పరామర్శించి ఓదార్చారు. మధ్యహ్నాం గవర్నర్ ప్రియాంక ఇంటికి వెళ్లిన గవర్నర్ హంతకులకు శిక్షించే విదంగా తోడ్పడతానని గవర్నర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తమకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రోడ్ల పైకి వస్తుండడంతో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. పలువురు రాజకీయ నాయకులు ప్రియాంకు కుటుంబసభ్యులకు పూర్తి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుాభుాతి తెలియజేశారు....
Comments
Post a Comment