**బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు**
బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి విజయవాడకు రూ.3.18కోట్ల విలువైన 8.86 కిలోల బంగారం తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని అంధేరికి చెందిన జయేష్ జైన్.. విజయవాడలోని ఇస్లాంపేటకు చెందిన పాగోలు శ్రీనివాసరావు ముంబయి నుంచి బంగారు ఆభరణాలు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారిని విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న పోలీసు అధికారులను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.

Comments
Post a Comment