**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న *ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ**
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న
*ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ*
*సూర్యాపేట డిపోకు చెందిన ఉద్యోగి*
*అర్వపల్లి మండలం, సూర్యానాయక్ తండా కు చెందిన లూనావత్ కృష్ణ*
గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి....
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా గా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను.....
మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది మీరు ఉద్యోగం లో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దానికి కారణం లేకపోలేదు సర్ మా తెలంగాణ లో నియంతృత్వ0 చూస్తా అని అనుకోలేదు.1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న.కానీ సర్ మా 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని , నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఉహించలేదు సర్ కానీ మీ బంగారు తెలంగాణ లో అది సాధ్యం అయింది సర్,నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజు నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్న సర్ కానీ ఒక్కటి మాత్రం నిజం సర్ నా RTC అక్క చెల్లెల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సర్, నేను సూర్యాపేట డిపో లో RTC కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక మోసకారి ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమన్నాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న నా పేరు యల్.కృష్ణ నా స్టాప్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సర్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి ayya CM సర్ గారు మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి.ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి.పాపం సర్ RTC వాళ్ళు సర్ మీమ్ములను చాలా అభిమానించారుసర్ కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా ఉహించిఉండరు సర్, పాపం RTC వాళ్ళు సర్ వాళ్లకు వచ్చే 15000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవం గా బ్రతుకుతున్నారు సర్.మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకున్న కనీసం పిలిచి మాట్లాడి ఉంంటే మీమీద గౌరవం తో ప్రాణాలు ఇచ్చేవారు సర్.కనీసం నేను మీ బంగారు తెలంగాణ లో సంతోషంగా లేను మా తల్లిదండ్రులు సర్ కనీసం వాళ్ళను అయిన సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు సర్.వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను దినంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్. ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ఈ లాఠీ దెబ్బలు ఏంది నా RTC సోదరులు ఏమి తప్పు చేశారు అని ఇంకా ఎంత మంది ని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు.అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే నేను మీ బంగారు తెలంగాణా లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు.మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజం లోని వ్యక్తిని నీ తెలంగాణ రాష్ట్ర0 లో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి. పేరు మీద అ సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్న సమాజంలో
గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగె నా ఉద్యోగ రాజీనామా ను తక్షణమే ఆమోదించగలరు.
ఇట్లు ///
L కృష్ణ
స్టాఫ్ నెంబర్ 176822
RTC క0డక్టర్ సూర్యాపేట డిపో.
Comments
Post a Comment