RTI పై నిర్లక్ష్యంగా, భాద్యతరహితంగా వ్యవహరించిన PCB అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
సమాచార హక్కు చట్టం పై పీసీబీ అధికారుల నిర్లక్ష్యం, భాద్యతరహితం అంటూ ఆరోపిస్తున్నా ఆర్టీఐ ధరకాస్తూ దారుడు.
నిర్లక్షంగా, బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారి పై చట్టపరంగా, విధుల్లో విఫలం చెందినందున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
*గడువులోగా సమాచారం ఇవ్వకుండా, గడువు తీరిన తరువాత ఓ లేఖ తయారు చేసి 63 రోజుల తరువాత పోస్టు చేసిన అధికారులు.
రామచంద్రపురం లోని పీసీబీ రీజనల్ ఆఫీసు ప్రజా సమాచార అధికారికి 2019 సెప్టెంబర్ 20వ తేదీన మా ప్రతినిధి 2 అంశములకు సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం క్రింద 10 రూపాయల ధరకాస్తూ రుసుము నగదు గా చెల్లించి దరఖాస్తు చేశాడు. చట్టాన్ని అమలు పరుచాలిసిన ప్రజా సమాచార అధికారి గడువులోపాల ఏలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్షంతో వ్యవహరించారు. ఈ నిర్వకాని కప్పి పుచ్చుకోవడానికి తెలివిగా మరో ఎత్తు వేశారు. గడువు తీరిన తరువాత మేలుకొని 2019 అక్టోబర్ 16వ తేదితో ఒకలేఖ తయారు చేశారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం చాలా సమగ్రమైనది మరియు భారీగా ఉంటుందని మరియు అభ్యర్థించిన సమాచారాన్ని ఇవ్వడానికి, చూపడానికి తేదీలు నిర్ణయించడం కష్టం అవుతుందని పేర్కొంటూ, కార్యాలయం వారు ధరకాస్తూ దారుడు ఇద్దరికి పరస్పరం సౌకర్యం వంతమైన తేదీన నిర్ణయించుకొని కార్యాలయవేళల్లో సమాచార ఫైల్స్ను పరిశీలించు కోవచ్చని లేఖలో పేర్కొన్నారు.
గడువు మీరిన తరువాత తప్పు కప్పి పొచ్చుకోవాడానికి లేఖ తయారు చేసుకొని దాదాపు 63 రోజుల తరువాత 2019 నవంబర్ 23 తేదీన పోస్టు చేశారు. పీసీబీలో సమాచార చట్టం అమలుకు పై అధికారుల పర్యవేక్షణ లేఖపోవడంతో పి ఐ ఓ చట్టాన్ని అమలుపరచడంలో బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్షంగా, బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారి పై చట్టపరంగా, విధుల్లో విఫలం చెందినందున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధరకాస్తూ దారుడు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుపారు.
Comments
Post a Comment