**ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌తో రైతు హల్‌చల్*!**

 



*మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌తో రైతు హల్‌చల్*!


గుంటూరు: మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ రైతు హల్‌చల్ చేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే.. రైతు శివ కోటేశ్వరరావు పట్టాదారు పాసుపుస్తకం కోసం నేడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన శివ కోటేశ్వరరావు నేడు ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు. అయితే దీనిని గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా హతాశులయ్యారు. అతని వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను గుర్తించకపోతే ఎంత ప్రమాదం జరిగిఉండేదో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్పై ఓ రైతు పెట్రోల్‌ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో సిబ్బంది ప్రతిక్షణం ఆందోళనతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటన నాటి నుంచి కొందరు ఎమ్మార్వోలు పోలీసుల రక్షణ కోరగా.. మరికొందరు ఎమ్మార్వోలు మాత్రం అర్జీదారులు తమ దగ్గరకు చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టిన ఉదంతాలు ఉన్నాయి.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్