**గ్రీవెన్స్ పరిష్కారానికి సాంకేతికతను జోడిస్తాం : ఎస్పీ రంగనాధ్**
*గ్రీవెన్స్ పరిష్కారానికి సాంకేతికతను జోడిస్తాం : ఎస్పీ రంగనాధ్*
- - ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా సాంకేతిక పరిజ్ణానం
- - ఆర్జీదారులకు సమయం వృధా కాకుండా ఎస్.ఎం.ఎస్.ల.ద్వారా సమయం కేటాయింపు
నల్గొండ : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సోమవారం, సాధారణ రోజులలో వచ్చే దరఖాస్తుదారులు, బాధితుల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను జోడించి త్వరగా పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులకు తదుపరి చర్యల కోసం ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్ డే ను మరింత సమర్ధవంతంగా నిర్వహించడం కోసం అన్ని స్థాయిలలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. భూ తగాదాల విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. భూ సమస్యలను శాంతి భద్రతల సమస్యగా మారకుండా ఉండేలా పోలీస్ అధికారులు, సిబ్బందికి భూ చట్టాలపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్స్, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక గ్రీవెన్స్ డే పటిష్ట నిర్వహణ కోసం దరఖాస్తుదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం, వారి పిర్యాదు ఏ మేరకు పరిష్కారం అయ్యిందో తెలుసుకోవడం, పరిష్కారం అయిన పిర్యాదు వివరాలు వారికి తెలియపరిచి వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవాలందించేలా పని చేస్తున్నట్లు చెప్పారు. పిర్యాదు దారులు, దరఖాస్తుదారుల సమయం వృధా కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా టైం స్లాట్ విధానాన్ని అమలు చేస్తూ ఎస్.ఎం.ఎస్.ల రూపంలో సమాచారం ఇస్తూ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం కల్పించే విధంగా సమర్ధవంతంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Post a Comment