**పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్  **

 


పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్


 
అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధి లోని నూలుబండ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి బెంచ్ కు తాడుతో కట్టి బంధించడంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి ఆగ్రహం వెలిబుచ్చారు.   
చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి వారి భవితవ్యాన్ని తీర్చి దిద్దాల్సిన చోట ఉపాధ్యాయుల అవగాహనా రాహిత్యం, కోపావేశాల వలన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.  జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్ తో మాట్లాడారు.   ఎంక్వయిరీ జరిపించి బాలల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై  విచారణ జరిపించి తక్షణమే బాధ్యులపై క్రిమినల్ మరియు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని తెలియచేసారు.   
బాలల న్యాయ చట్టం సెక్షన్ 82 , ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం 2009  సెక్షన్ 17  ప్రకారం పాఠశాలల్లో శారీరిక, మానసిక దండన చట్టరీత్య నేరం అదేవిధంగా పైన జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి బాలలకు  రావలసిన నష్టపరిహారాన్ని అందేలా చూడాలని ఆదేశించారు.   
మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వక రాష్ట్రంగా అందరూ పిల్లలు విద్యనభ్యసించేలా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు వివిధ వినూత్న పథకాలు ప్రవేశ పెట్టి  అమ్మఒడి , ఆనందవేదిక, నో బాగ్ డే, స్కాలర్షిప్స్ , కెజిబివిలలో 12  తరగతి వరకు విద్య ద్వారా 6 నుండి 18  సంవత్సరాలవరకు ఉన్న బాల బాలికలందరు  ఆనంద ఉత్సాహాల మధ్య నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తున్నారు  అని  తెలిపారు.   
కానీ  ఉపాధ్యాయులలో అవగాహనా లోపం కారణంగా అక్కడక్కడాజరుగుతున్నా ఇలాంటి సంఘటనలు చిన్నారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. కమిషన్ ఈ  కేసు ను  సుమోటోగా తీసుకుంటుందని అన్నారు.
 
జి. హైమావతి, చైర్ పర్సన్, 8500242805
[29/11, 8:17 am] Kcl Jk News: మహిళల పెన్షన్‌లో పలు మార్పులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!


అమరావతి, విశ్వం వాయిస్ న్యూస్ :  వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్‌‌లో పలు కీలక మార్పులు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతలు, కేటగిరీల నిబంధనల్లో కొన్ని సవరణలు చేశారు. వితంతు, పెళ్లి అయ్యి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం సాగిస్తున్న మహిళలు కేటగిరి 2 కిందకు వస్తారని.. అంతేకాకుండా 45 ఏళ్ళులోపు ఉన్నవారు పెన్షన్‌కు అర్హులని స్పష్టం చేసింది. ఇకపోతే పిల్లలు లేని వితంతువులు, మైనర్ పిల్లలున్న వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరలా వివాహం చేసుకునే వరకు.. వీరందరికి పెన్షన్‌ అందుతుందన్నారు. ఇక ఈ కేటగిరి 2 తరపున పెన్షన్ తీసుకునేవారు.. కేటగిరి 1 పెన్షన్‌ కూడా తీసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


మరోవైపు కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతి చెంది.. వివాహం కానీ కూతురు ఉంటే.. ఆమెకు 25 ఏళ్ళు వచ్చేవరకు.. అంతేకాకుండా సొంతంగా ఉపాధి లభించేవరకు పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఆమెకు పెళ్లి అయ్యి.. ఆ తర్వాత కూడా పెన్షన్ పొందుతుంటే మాత్రం.. కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ఇలా పలు నిబంధనలను సవరించి.. వాటికి అనుగుణంగా ట్రెజరీ, పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్