**రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయండి- నిందితుడి తల్లి**

 


పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నారాయణ పేట మక్తల్ మండలంలోని జిక్లేరుకు చెందిన మహ్మద్ పాషా ఉన్నాడు. 


అతడి తల్లి ఈ రోజు మీడియాతో మాట్లాడి పలు వివరాలు తెలిపింది. జిక్లేరులోని తమ ఇంటి నుంచే మహ్మద్ పాషాను పోలీసులు తీసుకెళ్లినట్లు అతడి తల్లి వెల్లడించింది.


ఐదేళ్ల నుంచి తన కుమారుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని వివరించింది. 


అతడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడని, ఆ తర్వాత 3 గంటలకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపింది. అయితే తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ నిందితుడి తల్లి పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఈ కేసును చేధించినట్లు తెలుస్తోంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్