**నల్గొండ పిసిబికి ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు!**
నల్గొండ పిసిబికి ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు!
వారు లాభం పొందుతారో, భాదితులకు న్యాయం చేస్తారో?
జిన్నింగ్ మిల్లుల నుండి వెలువడిన దుమ్ము, ధూళి తో నిండిన భూమి
జిన్నింగ్ మిల్లుల నుండి వెలువడిన దుమ్ము, ధూళి తో నిండిన బావి
ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు. ఫిర్యాదు వస్తే లబ్ది పొందవచ్చని ఎదురుచూస్తున్నారు సదరు ఆఫీస్ వారు. గత రెండు ఏండ్లుగా ఓ మహిళ రైతు కాలుష్యం తో ఇబ్బందులు పడుతున్నామని పంటలు పండుటలేదని, తీవ్రంగా నష్ట పోతున్నామని మోర పెట్టుకున్న కనికరించడంలేదు ఈ అధికారులు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం శివారులో 3 ఎకరాల భూమి ఉన్నదని దాని వెనుక ఉన్న 2 జిన్నింగ్ మిల్లు ల నుండి దుమ్ము, దూళి, శబ్ద కాలుష్యం వస్తున్నదని దానితో పంటలు పండక ఆర్థికంగా నష్టపోతున్నామని, మాకు అరోగ్య సమస్యలు వస్తున్నాయని గత రెండు ఏండ్ల నుండి 2 సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా చర్యలు తూసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు 29 నవంబర్ న మరో ఫిర్యాదు చేశారు ఆ రైతు. మరి ఈ అధికారులు షరా మాములు లాగా స్వంత లాభం పొందుతారో లేక బాధితులకు న్యాయం చేసి వారికి లాభం కలిగిస్తారో వేచి చూడాలిసిందే?
Comments
Post a Comment