**ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు**
అమరావతి:
• ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు
• స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు ఇవ్వనున్న ప్రభుత్వం
• గతంలో ప్రకటించిన దానికన్నా స్కూలు బ్యాగు, నోట్ బుక్స్ అదనంగా ఇవ్వనున్న ప్రభుత్వం
• యూనిఫారమ్స్ కుట్టించుకునేందుకు డబ్బులు, ఒక జతషూస్,సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్న ప్రభుత్వం
• మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందించనున్న ప్రభుత్వం
• పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని సీఎం ఆదేశం
• ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళికను తయారుచేయడంపై సీఎం చర్చ వచ్చే ఏడాది 1 నుంచి ఆరో తగరతి వరకూ ఇంగ్లిషు మీడియం
• పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామన్న అధికారులు
• బ్రిడ్జి కోర్సుల నిర్వహణపై ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు
• విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జికోర్సులు చేపట్టాలని అధికారుల ప్రతిపాదన
• పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశం
• టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్ ఇవ్వాలన్న సీఎం
• పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉత్తమ ప్రమాణాలు తీసుకువస్తున్నామన్న సీఎం
• గణితాన్ని సులభంగా అర్థంచేసుకోవడానికి చికాగోయూనివర్శిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతుందన్న ముఖ్యమంత్రి
• అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ, ఇంగ్లిషు మాధ్యమం, బోధన తదితర అంశాల్లో బ్రిటిష్ కౌన్సిల్ భాగస్వామ్యం అవుతుందన్న సీఎం
• ఉత్తమ ఫలితాలనిచ్చే విద్యావిధానాలు, విద్యావ్యవస్థల అంశాల్లో సింగపూర్ ప్రభుత్వం సహకారం ఉంటుందన్న అధికారులు
• ఇలాంటి గొప్ప సంస్థలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకు వస్తుందన్న సీఎం
• విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులపై ఇవాళ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్న సీఎం
మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం సమీక్ష
• మధ్యాహ్న భోజనం నాణ్యత దెబ్బతినకూడదు : సీఎం
• మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తున్నాం: సీఎం
• వారికి వెనువెంటనే చెల్లింపులు చేసేలా ప్రభుత్వం నుంచి చర్యలు : సీఎం
• మధ్యాహ్నభోజనం కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలి: సీఎం
• నాడు –నేడు కార్యక్రమంలో, స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు మంచి భాగస్వామ్యం కల్పిస్తున్నాం: సీఎం
• పుస్తకాలు, యూనిఫారమ్స్, షూలు సకాలానికే అందించాలని ఆదేశాలు: సీఎం
Comments
Post a Comment