**త్రాగునీటి పనులలో అలసత్వం వలదు అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు **
త్రాగునీటి పనులలో అలసత్వం వలదు
అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు
#ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకం కార్యక్రమం ఇది
#నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై పైప్ లైన్లు వేస్తే చర్యలు కఠినం
#భగీరథ పనుల పూర్తికి 100 రోజుల ప్రణాళిక
#డిసెంబర్ 25 నాటికి ఓ హెచ్ యస్ ఆర్ లు పూర్తి కావాలి
#2,277 కోట్లకు గాను 1,564 కోట్లు గ్రిడ్ పనులకు వ్యయం
#ఇంట్రా పనులకు 590.57 కోట్లు
#యం.యస్ పైప్ లైన్ 90.90 కిలోమీటర్లు పూర్తి
#హెచ్.డి.పి.ఈ 2247 కిలో మీటర్లు, డి ఐ 928.22కిలో మీటర్ల పూర్తి
#1534 కు గాను 1433 ఓ హెచ్ యస్ ఆర్ ట్యాన్క్ లు పూర్తి
#4214.17 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పూర్తి
#పట్టణప్రాంతాలతో కలుపుకుని 1710 అవాస ప్రాంతాల్లో ఇంట్రా పూర్తి
#13,18,945 జనాభా కు గాను 3,81,372 ఇండ్ల గుర్తింపు
త్రాగునీటి పనులలో అలసత్వం వలదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణిత గడువు తేదీ లోపే మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులలో జరుగుతున్న జాప్యం పై ఆయన అధికారులను నిలదీశారు.
మిషన్ భగీరథ, నీటిపారుదల, ఎన్ యస్ పి ,కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెళ్ళేం ల ప్రాజెక్ట్ ల పై సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు లతో పాటు రవీంద్ర నాయక్ ,నోముల నర్సిమయ్య ఇంచార్జ్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా అటు గ్రిడ్ ఇటు ఇంట్రా పనులను సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఆడపడుచు నీటి కోసం బారులు నడిచి పోకుండా ఉండేందుకు గాను ఇంటింటికీ నల్లా పేరుతో చేపట్టిన బృహత్ ప్రణాళిక మిషన్ భగీరథ పధకం అన్నారు .అటువంటి పధకం అమలు కోసం ఒక్క నల్గొండ జిల్లాలోనే గ్రిడ్ పనుల కోసం గ్రిడ్ ఇంట్రా పనులకు కలిపి 2,867.57 కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికి పనులు పూర్తి చెయ్యడం లో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.డిసెంబర్ 25 నాటికి ఓ హెచ్ యస్ ఆర్ లు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడ పనులు పూర్తి కాలేదని శాసనసభ్యులు రవీంద్ర నాయక్ అధికారుల మీద మండిపడ్డారు.
నల్గొండలో ఆర్ డబ్ల్యూ యస్ పబ్లిక్ హెల్త్ శాఖ లకు సమన్వయం లోపించడం పై స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకరాగా మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ డబ్ల్యూ యస్ అధికారులను తీవ్రంగా మందలించారు. రోడ్ల ను తవ్వి ద్వంసం చేస్తే కాంట్రాక్టర్లు పై చర్యలు కఠినంగా తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు మాట్లాడుతూ ఏజెన్సీ కాగితాలమీదనే పనులు చూపిస్తున్నారని క్షేత్రస్థాయిలో అందుకు బిన్నంగా పనులు జరుగుతున్నాయన్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని వివరించాలన్నారు.అందుకు స్పందించిన అధికారులు మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకే ఆర్ డబ్ల్యూ యస్ 100 రోజుల ప్రణాళిక రూపొందించుకుందన్నారు.ఇప్పటికే 1564.06 కోట్లు ఖర్చుతో నల్లగొండ జిల్లాలో మూడు సెగ్మెంట్ లలో 2,247 కిలోమీటర్లు హెచ్ డి పి ఈ పైప్ లైన్ 928.22 కిలో మీటర్లు డి ఐ పైప్ లైన్ 90.90 కిలోమీటర్లు యం యస్ గ్రిడ్ పైప్ లైన్ పనులుపూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే గాకుండా ఇంట్రా విలేజీ పనులలో మొదట గుర్తించిన 1534 ఓ హెచ్ యస్ ఆర్ లకు గాను 1433 పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.మిగిలిన ట్యాన్క్ ల నిర్మాణాలు డిసెంబర్ మాసంతానికి పూర్తి చేయనున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం గా వివరించారు. మొత్తం 31 మండలాలకు గాను 13 లక్షల 18 వేల 945 మంది జనాభా కు గాను 3,81,372 గృహాలకు నీటి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతే గాకుండా 4214.57 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పనులకు గాను 4090.30 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Post a Comment