**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న *తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?*
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న
*తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?*
సీఎం కేసీఆర్ ఎత్తులకు కేంద్రం పై ఎత్తులు వేసిందా…? తెలంగాణ ఆర్టీసీ కేంద్రం పరం కాబోతుందా…? ప్రైవేటు ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా…? కోర్టులు చేతులెత్తేయటంతో బీజేపీ ఇటు నుండి గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా…?
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో…
కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 31శాతం వాటాదారుగా ఉన్న కేంద్రం, మరో 25శాతం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆర్టీసీ పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్లబోతుందని, ఇటు ఉద్యోగులను కాపాడటమే కాకుండా… కేసీఆర్‌కు చెక్‌పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర బీజేపీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఆర్టీసీలో సీఎం కేసీఆర్ బంధువులు దూరిపోయారని… దాదాపు 45 పెట్రోల్ బంకులు అత్యధిక లాభాలు వచ్చే వాటిని సీఎం కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యునికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
ఇక టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం బంధువు.. అత్యంత సన్నిహితుడైన మరొకరికి చెందిన NETXCELL అనే సంస్థకు కట్టబెట్టేశారు. 2015 నుండి ఈ సంస్థ తమ ఉద్యోగులతోనే టికెట్ల అమ్మకాలు, ప్రయాణికుల సంఖ్య, లాభదాయక రూట్లపై పూర్తి సమాచారం తీసుకుంది. ఇక టీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో సీఎంతో సన్నిహితంగా ఉండే 12 మంది ఎమ్మెల్యేలకు కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే బస్టాండ్లను లీజ్‌కు కట్టబెట్టగా…
కొన్ని చోట్ల ఆర్టీసీ భూములను లీజ్‌కు ఇచ్చినట్లు కేంద్రానికి సాక్ష్యాలతో సహా సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ అంశాలను బీజేపీ కేంద్ర నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పంపించినట్లు ప్రకటించాయి.
అయితే, నష్టాల్లో ఉన్నాయన్న కారణంతో ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారు. కానీ అక్కడ ఇంత పెద్దఎత్తున ఆర్టీసీకి ఏ రాష్ట్రంలోనూ భూములు, ఆస్తులు లేవు. పైగా కేంద్రం రాబోయే రెండేండ్లలో 90శాతం సబ్సిడీతో బస్సులు రాష్ట్రాలకు ఇస్తోంది.
పైగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా కావటంతో డీజీల్ భారం ఉండదు. ఆక్యూపెన్సీ పెంచటం కోసం ప్రతి గ్రామానికి ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పరం అయితే జరిగే బస్‌పాస్, వికలాంగులు, మహిళలకు ఇచ్చే రాయితీలు ఉండవు. కానీ కేంద్రమే నడిపితే అవి అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.
మీరు చస్తే చావండి… మాకు ఆర్టీసీ ఆస్తులు మాత్రం కావాలి అన్న చందంగా ప్రభుత్వ వైఖరి ఉందని, ప్రభుత్వంలో విలీనం చేస్తే… మీరు ఇష్టమొచ్చినట్లు చేసుకున్నా ఎవరూ అడగకపోయేవారు కదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియాలో కార్మికులపై వ్యతిరేక కథనాలు రాసి ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Comments
Post a Comment