** ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం '**

 ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం ' సందర్బముగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ మరియు విధ్యాశాఖ ఆద్వర్యములో    1. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో  మంగళవారం ఉ. 9.00 గం.లకు  న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమంలొ ఉమ్మడి నల్లగొండ  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.వేణు మాట్లాడుతూ    రాజ్యాంగ బద్దుడే నిజమైన పౌరుడని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించటమే కాదు, విధులు పాటించాలని, లౌకిక రాజ్యంలొ రాజ్యాంగం ఆపాదించిన హక్కులతొ భారతదేశం స్వేచ్చా, సౌభాతృత్వముతొ వెలుగుందుతుందని, చట్టం ముందు అందరం సమానులమేనని తెలిపారు. నేటి సమాజంలొ అందరూ అక్షరాస్యతతొ, ఆధునిక విజ్ఞానాన్ని ఆపాదించుకొని సంఘ పరిస్థితులను తెలుసుకుంటూ జీవనం సాగిస్తున్న మానవజీవితంలొ ఇంకా వరకట్నం కోసం ఆశ పడుతున్న  జనాలు  సభ్య సమాజంలొ ఉన్నారని , చట్టాలున్నా మనుషులు మారటం లేదని తెలుపుతూ రాజ్యాంగ ప్రవేశిక విధ్యార్థులతో చదివించారు. నల్లగొండ అదనపు ఎస్.పి. నర్మద మాట్లాడుతూ విధ్యార్థినులు రాజ్యాంగాన్ని చదివి అవగతం చేసుకోవాలని , ప్రాధమిక విధులు నిర్వర్తించాలని తెలుపుతూ, వరకట్నము రూపు మాపాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ మునవర్ మాట్లాడుతూ శాస్త్రీయ విధ్యతో పాటు , చట్టాలు,  సంఘం పట్ల అవగాహన ఏర్పర్చుకోవాలని తెలిపారు. షీ టీం ఇంచార్జ్ సి.ఐ. రాజశేఖర్ మాట్లాడుతూ వైవాహిక వివాదాలు ఎక్కువ అవుతున్నాయని , బాలికలు అప్రమత్తముగా ఉండాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విధ్యాధికారి బాలునాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించిందని, హక్కులతో పాటు విధులూ నిర్వర్తించాలని తెలిపారు. జాగృతి టీం పాటలతో బాలికలను జాగృతం చేశారు. కార్యాక్రమములో సఖి కేంద్రం సెంట్రల్ అడ్మిన్ నళిని,  న్యాయవాదులు యం. లెనిన్ బాబు, భీమార్జున రెడ్డి, జిల్లా న్యాయ సేవ సంస్థ సభ్యులు కె.వి. రమణారావు, లెక్చరర్స్,  విధ్యార్తినిలు  పాల్గొన్నారు.  న్యాయ సేవ సదన్ లో ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్స్ తో రాజ్యాంగ ప్రవేశిక చదివించారు. కార్యాక్రమములో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి యం.వి. రమేశ్ న్యాయమూర్తులు మరియు న్యాయవాదులతో రాజ్యాంగ ప్రవేశిక చదివించారు. ఈ సందర్భముగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తి అందరూ కలిగి ఉండాలని ఆయా కోర్టులలో పెండింగులలో ఉన్న పాత కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ఆయా కోర్టులు కృషి చేస్తున్నాయని తెలుపుతూ , న్యాయవాదులు న్యాయసహాయం కోసం వచ్చేవారికి సహాయం అందించాలని తెలిపుతూ, సంఘములో వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. కార్యాక్రమములో నల్లగొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి టి. కిషోర్ కుమార్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.  నల్లగొండ పట్టణములోని అరోరా లా కళాశాలలో లా డే కార్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యాక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ విజయసుధ, జిల్లా న్యాయ సేవ సంస్థ సభ్యులు కె.వి. రమణారావు, విధ్యార్థులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్