**పత్తి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్**
*పత్తి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్*
అయిటి పాముల లో శ్రీ నాథ్ పత్తి జిన్నింగ్ మిల్లును బుధవారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తనిఖీ చేసి పత్తి కొనుగోళ్లు పరిశీలించారు రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి 8 నుండి 12 తేమ శాతం వుండేలా పత్తి తీసుకు వచ్చి సి.సి. ఐ.కొనుగోలు కేంద్రం లో మద్దతు దర పొందాలని ఆయన రైతులకు సూచించారు.ఇప్పటి వరకు జిల్లాలో సి.సి. ఐ.కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ నెల 21 వరకు కొనుగోలు చేసిన రైతులకు రైతులకు చెల్లింపు కూడా చేసినట్లు వివరించారు.ఇంఛార్జి కలెక్టర్ వెంట మార్కెటింగ్ ఏ. డి. అబ్దుల్ అలీం, డి.సి.ఓ.అర్.శ్రీనివాస మూర్తి తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment