***~_వాట్సాప్_~* .....**

*~_వాట్సాప్_~* ......


వాట్సాప్​.. స్మార్ట్​ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. 


ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్​ను వాడుతున్నారు. 


కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు. 


ఈ యాప్​ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు. 


యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్​ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్​డేట్లు తెస్తుంది. 


తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్​బుక్​కు చెందిన మెసెంజర్ దిగ్గజం​. 


ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం.


డార్క్​ మోడ్​..
వాట్సాప్​ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్​డార్క్​ మోడ్​. 


ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే వాట్సాప్​ ఇంటర్​ఫేస్​​ సహా అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది. 


దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్​ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. 


మరీ ముఖ్యంగా ఫోన్​​ ఛార్జింగ్​ ఎక్కువసేపు వస్తుంది. 


ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. 


త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుంది.


బూమరాంగ్ ఫీచర్​..
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్​ బూమరాంగ్. 


ఏదైన ఫొటోను సరదాగా స్వల్ప నిడివిగల వీడియోగా మార్చడమే ఈ ఫీచర్​లో ఉన్న సౌకర్యం. 


ప్రస్తుతం ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఫీచర్​ తెగ హల్​చల్​ చేస్తోంది. 


అలాంటి ఫీచర్​ను తమ వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. 


ఇందులో భాగంగా ఇప్పటికే ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. 


ఆండ్రాయిడ్​ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుంది.


డిలీట్​ ఆటోమేటిక్​..
వాట్సాప్ యూజర్లు అవతలి వ్యక్తికి పంపే సందేశాలు కొంత సేపటి తర్వాత వాటంతటవే డిలీట్​ అయ్యేలా ఓ ఫీచర్​ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఒక వాట్సాప్ యూజర్​ మరో వాట్సాప్ యూజర్​కు సందేశాలు పంపే ముందు తన మెసేజ్​ అవతలి వ్యక్తికి ఎంత సేపు కనిపించాలి అనేది ముందుగానే నిర్ణయించొచ్చు. 


ఇలా ఈ ఫీచర్​ను ఉపయోగించి పంపిన సందేశాలు 5 సెకన్ల నుంచి గంట వ్యవధిలో వాటంతట అవే డిలీట్​ అవుతాయి. 


తాత్కాలిక అవసరాలకు పంపే సందేశాలకు ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగపడనుంది.


ప్రస్తుతం 'డిలీట్​ బోత్'​ అనే ఫీచర్​ ఇంచుమించు ఇలాంటి సదుపాయాలతో అందుబాటులో ఉంది. 


ఈ సదుపాయం ద్వారా ఒకరికి పంపాల్సిన సందేశం వేరొకరికి పంపినప్పుడు.. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ సందేశాన్ని పూర్తిగా డిలీట్​ చేయొచ్చు. 


గరిష్ఠంగా.. సందేశం పంపిన గంటలోపు డిలీట్ ​బోత్​ సదుపాయాన్ని వినియోగించే అవకాశముంది. 


ముఖ్యంగా యూజర్ మాన్యువల్​గా ఈ సదుపాయం వినియోగించాల్సి ఉంటుంది.


ఇటీవలి కొత్త ఫీచర్లు ఇవే..
వాట్సాప్ ఇప్పటికే.. ఫింగర్​ప్రింట్​, ఫేస్​ అన్​లాక్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. 


దీనితో పాటు అనవసర గ్రూపుల్లో.. గుర్తు తెలియని వారు మిమ్మల్ని చేర్చేందుకు వీలు లేకుండా సెక్యూరిటీ ఫీచర్​ను తెచ్చింది. 


దీని ద్వారా మీరు ఎంపిక చేసుకున్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చే వీలుండనుంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్