**కరడుకట్టిన నేరస్థుడికి మహిళా ఎస్ఐ షాక్**

కరడుకట్టిన నేరస్థుడికి మహిళా ఎస్ఐ షాక్ ఇచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్రాపూర్ పట్టణంలో సంచలనం రేపింది. ఓ కరడుకట్టిన నేరస్థుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి... వలపన్ని అతన్ని ఆలయానికి పిలిపించి... అరెస్ట్ చేసిన మహిళా ఎస్ఐ ఉదంతం చత్రాపూర్ పట్టణంలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లా బిజౌరీ గ్రామానికి చెందిన బాలకిషన్ చౌబే హత్య కేసుతోపాటు 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడు. కరడుకట్టిన ఈ నేరస్థుడి ఆచూకీ చెబితే పదివేల రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. పోలీసులు బాలకిషన్ ను పట్టుకునేందుకు పలుసార్లు యత్నించినా అతను తప్పించుకు తిరుగుతున్నాడు..బుందేల్‌ఖండ్‌లోని ఓ మహిళా కార్మికురాలి పేరిట సిమ్ కార్డును నిందితుడికి పోలీసులే పంపించారు. నిందితుడు పెళ్లి చేసుకునేందుకు మహిళ కోసం చూస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళా ఎస్ఐ కొత్త నాటకానికి తెర లేపింది. అనంతరం ఓ మహిళా ఎస్ఐ కరడుకట్టిన నేరస్థుడిని పట్టుకునేందుకు ఉత్తుత్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి వలపన్నింది. బాలకిషన్ చౌబేకు పొరపాటున రాంగ్ నంబరుకు ఫోన్ చేశానని చెప్పి మహిళా ఎస్ఐ కాల్ చేసింది. అనంతరం వారంరోజుల పాటు నిందితుడితో ఫోన్ లోనే మహిళా ఎస్ఐ మాటలు కలిపింది. అంతే నిందితుడు పెళ్లి ప్రతిపాదన చేయగా సరేనంటూ అతన్ని పెళ్లి చేసుకునేందుకు బిజౌరీ గ్రామంలోని దేవాలయానికి రమ్మని కోరింది.
 
మహిళా ఎస్ఐ తన తోటి పోలీసు సిబ్బందితో కలిసి దేవాలయానికి మఫ్టీలో వచ్చింది. పెళ్లి చేసుకునేందుకు వచ్చిన కరడుకట్టిన నిందితుడు బాలకిషన్ చౌబేను వలపన్ని అరెస్టు చేసిన మహిళా ఎస్ఐ అతన్ని శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు.కోర్టు జడ్జి నిందితుడైన బాలకిషన్ ను జైలుకు పంపించారు.పెళ్లి నాటకం ఆడి కరడు కట్టిన నేరస్థుడికి అరదండాలు వేసిన మహిళా ఎస్ఐను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్