** రూ.10-20కే కిలో ఉల్లి ...**


రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం..


 ఇద్దరు యువకుల అరెస్ట్ !గ్వాలియర్: ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా సామాన్యులకు ఉల్లి అందుబాటులో లేకుండా పోవడంపై ఆగ్రహం చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మికి.. సమీపంలోని కూరగాయల మార్కెట్‌లోని ఓ గోడౌన్‌ నుంచి ఆరు క్వింటాళ్ల ఉల్లిగడ్డ, మరో క్వింటాల్ ఎల్లిగడ్డ దొంగిలించారు. దొంగిలించిన ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డను మరో చోట బహిరంగ మార్కెట్‌లో రూ.10-20లకే విక్రయించారు. తద్వారా సామాన్యులకు కారుచౌకగా ఉల్లి అందించేలా చేస్తున్నామనే భావించారు కానీ తాము చేస్తోంది నేరం అని తెలుసుకోలేకపోయారు.ఇదిలాఉండగా.. మార్కెట్‌లో ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఉండగానే ఇద్దరు యువకులు ఇలా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు. రూ.100 కాస్త అటు ఇటుగా అమ్ముడవుతున్న ఉల్లిగడ్డను రూ.10-20కే ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా యువకులు తమ నేరాన్ని అంగీకరించారు. ఉల్లి ధరలు పెరుగుతున్న వైనం తమను తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురిచేసిందని.. అందుకే అలా ఉల్లిని దొంగిలించి తక్కువ ధరకే విక్రయించామని వివరించారు.
ఈ ఘటనపై జనక్‌గంజ్ పోలీసు స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ ప్రీతీ భార్గవ్ మాట్లాడుతూ.. యువకులు దొంగిలించిన సొత్తు విలువ రూ.60,000 విలువ చేస్తుందని తెలిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ప్రీతి భార్గవ్ వెల్లడించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్