**10వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు**
*అమరావతి*
*10వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు*
*అన్నదాతల ఆగ్రహావేశాలతో అట్టుదుకుతున్న అమరావతి*
*మంత్రివర్గ సమావేశం దృష్ట్యా ఉగ్రరూపం దాల్చిన ఉద్యమం*
*తుళ్లూరు మండలం లోని అన్ని గ్రామాల్లో 144సెక్షన్ విధించిన పోలీసులు*
*ప్రతి గ్రామ కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేసి ఉంచిన పోలీసులు*
*సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు*
*మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు*
*తుపాకులు, లాఠీ చార్జ్ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున దిగిన బలగాలు*
*సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరింపు*
*అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తున్న రాజధాని గ్రామాలు*
*గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాo. -రైతులు*
*సచివాలయం వెళ్లే ప్రధాన రహదారి కావటం తో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం*
*10వ రోజూ రహదారిపై మహాధర్నా కొనసాగించాలని రైతుల నిర్ణయం*
*వెలగపూడి, కృష్ణాయపాలెం లో కొనసాగనున్న 10వ రోజు రిలే నిరాహారదీక్ష లు*
*ఉద్దండరాయిని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి నిరసన తెలపనున్న రైతులు*
*ఉద్దండరాయిని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో రైతుల నిరసనకు మద్దతుగా మౌన దీక్ష చేయనున్న భాజపాతో నేతలు*
*ఏ గ్రామానికి ఆ గ్రామాన నిరసనలు తెలపనున్న రాజధాని రైతులు*
*కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగించనున్న రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు*
*సచివాలయం వద్ద భారీగా పోలీసులు*
*సచివాలయం వైపు ఎవరినీ అనుమతించని పోలీసులు*
*మందడం వద్ద రైతులు ధర్నాకు కూర్చోకుండా భారీగా పోలీసులు మోహరింపు*
Comments
Post a Comment