**పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్**
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.6.40 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రూ. 6.06 కోట్ల రూపాయలతో నిర్మించించిన ఖమ్మంపాడు - తొండలగోపవరం, మీనవోలు తొండలగోపవరం వరకు బ్లాక్ టాప్(BT) రోడ్డు ప్రారంభించారు.. రూ.10 లక్షలతో ఖమ్మంపాడు గ్రామంలోని అన్ని సెంటర్లలో ఏర్పాటు చేసిన HAI MAST విద్యుత్ లైట్లు, రూ. 16 లక్షలతో నిర్మించిన ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ భవనం, రూ. 8 లక్షలతో గ్రామంలో నిర్మించిన SC కమ్యూనిటీ భవనం ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు గారు, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు గారు, గ్రామ సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ వెంకటేశ్వర్లు గారు జడ్పీటీసీలు, ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment