**సౌదీ జర్నలిస్ట్ ఖషోగీ హత్య కేసులో.. ఐదుగురికి మరణ శిక్ష..ముగ్గురికి 24ఏళ్ల జైలు**
సౌదీ జర్నలిస్ట్ ఖషోగీ హత్య కేసులో.. ఐదుగురికి మరణ శిక్ష..ముగ్గురికి 24ఏళ్ల జైలు
రియాద్ : సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖషోగీ దారుణ హత్య కేసులో సౌదీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హత్యలో నేరుగా భాగస్వాములైనందుకు ఐదుగురికి మరణ దండన విధించగా, నేరాన్ని కప్పిపుచ్చినందుకు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముగ్గురికి 24 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మిగతా ముగ్గురు నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. జమాల్ ఖషోగ్జీ సౌదీ అరేబియా జర్నలిస్టు .. గతేడాది అక్టోబర్ 2న సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్‌సల్మాన్, తన టర్కీ ప్రియురాలుతో వివాహం జరిగిందనే కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో ఖషోగ్జీకి, సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ జరిగిందనీ, ఈ క్రమంలోనే ఆయనకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చారనీ, దీంతో మరణించడాన్ని అధికారులు తెలిపారు. అనంతరం అతని మృతదేహాన్ని ముక్కలు చేసి, కాన్సులేట్ బయట వేచి ఉన్న మరో వ్యక్తికి అందజేశారని వెల్లడించారు.
సౌదీ అరేబియా ఏజెంట్లేనంటూ..
సౌదీ అరేబియా ఏజెంట్లు ఖషోగ్జీని హత్య చేసి ఉంటారంటూ అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు అన్ని దేశాలు కూడా ఖషోగ్జీ హత్యోదంతం పట్ల స్పందించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎనిమిది మందికి శిక్షను ఖరారు చేసినట్టు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
రాజ కుటుంబ సలహదారుపైనా అనుమానాలు..
కేసు కొట్టివేత ఇదే కేసులో- సౌదీ అరేబియా రాజ కుటుంబీకుల సలహాదారు సవుద్-అల్-ఖ్వాతానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల పాటు విచారించారు. ఈ హత్య కేసులో ఆయన ప్రమేయం లేదని తేలినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలన్-అల్-షలాన్ వెల్లడించారు.
హత్యలో ప్రమేయం లేదన్న యువరాజు సల్మాన్
ఈ హత్యలో యువరాజు సల్మాన్ ప్రమేయముందని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై యువరాజు స్వయంగా స్పందించారు. ఈ హత్యలో తనకు ఎలాంటి ప్రమేయమూ లేదని యువరాజు తేల్చిచెప్పారు. అయితే ఇది సౌదీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వ్యక్తులు చేసినందున సౌదీ నాయకుడిగా దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆయన ఈ ఏడాది అక్టోబరులో వ్యాఖ్యానించారు.
రహస్య విచారణ
విచారణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని, అర్థవంతమైన జవాబుదారీతనానికి సౌదీ అధికార వ్యవస్థ అడ్డంకులు కల్పించిందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' ఆక్షేపించింది. ఖషోగ్జీ హత్య కేసు నేపథ్యంలో యువరాజు సీనియర్ సహాయక అధికారి సౌద్ అల్ ఖహ్తానీని ప్రభుత్వం తప్పించింది. తగిన ఆధారాల్లేకపోవడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది. ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఉపసారథి అహ్మద్ అసిరిపైనా విచారణ సాగింది. అయితే తగిన ఆధారాల్లేవనే కారణంతో ఆయన్ను నిర్దోషిగా తేల్చారు.
Comments
Post a Comment