**అయోధ్యలో ఫిబ్రవరి 25వరకు నిషేధాజ్ఞలు...**
*అయోధ్యలో ఫిబ్రవరి 25వరకు నిషేధాజ్ఞలు...*
రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వతేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయోధ్యలో నలుగురి కంటే ఎక్కువ మంది సమావేశం అవరాదని అనూజ్ కుమార్ కోరారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసన ఉద్యమాలతో అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ముందుజాగ్రత్త చర్యగా ఈ నిషేధాజ్ఞలు విధించారు. అయోధ్యలో నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అధికారులు కోరారు.
Comments
Post a Comment