**టీటీడీలో అస్తవ్యస్థంగా ఆడిటింగ్ వ్యవస్థ: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి**
*టీటీడీలో అస్తవ్యస్థంగా ఆడిటింగ్ వ్యవస్థ: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి*
*తిరుమల:* టీటీడీలో ఆడిటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు.
శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలకు లెక్కలు లేవన్నారు.
స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతీ కానుకకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందన్నారు.
తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారంటూ సీఎం జగన్‌పై వస్తున్న ఆరోపణలలో నిజం లేదని తెలిపారు.
చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడంటూ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.
రమణ దీక్షితులును తిరిగి ప్రధాన అర్చకుడిగా తీసుకోవడం శుభపరిణామని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
ఆదివారం తిరుమల శ్రీవారిని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, కేంద్ర సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ దర్శించుకున్నారు.
Comments
Post a Comment