**పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. **
విజయవాడ:
పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీడబ్ల్యూసీ అధికారులు... సోమవారం పీపీఏ, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
స్పిల్‌వే మినహా ఎలాంటి పనులు జరగడం లేదని ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ అధికారులు వ్యాఖ్యానించారు.
గోదావరి నీటిని కూడా వెనక్కి పంపలేకపోయారన్నారు.
రెండు నెలల సమయాన్ని వృథా చేశారని చెప్పారు.
కాఫర్ డ్యామ్ వచ్చే జూన్ దాకా అయ్యే పరిస్థితి లేదని తెలిపారు.
స్పిల్‌వే, గేట్ల బిగింపు ప్రణాళికకు..క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు.
ఢిల్లీలో త్వరలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
అయితే రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల వాదన మరోలా ఉంది.
నిధులు ఇవ్వకపోవడంతో పాటు డిజైన్లకు ఆమోదం తెలపలేదని అందుకే ఆలస్యం అవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
Comments
Post a Comment