**ఉల్లి లారీ బోల్తా..  క్షణాల్లో ఉల్లిపాయల బస్తాలు మాయం**

ఉల్లి లారీ బోల్తా.. 
క్షణాల్లో ఉల్లిపాయల బస్తాలు మాయం


ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. ఒక్క ఉల్లి దొరికినా కళ్ళకు అద్దుకుని మరీ తీసుకుంటున్న రోజులివి. అలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయలు తీసుకెళ్లేలారి బోల్తా పడితే పరిస్థితి ఎలా వుంటుంది. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 35 క్వింటాళ్ళ లోడుతో బొకారో- రామ్‌గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.బోకారో జిల్లాలోని కాశ్మారాలోని నేషనల్ హైవే-23 సమీపంలో ఉల్లి వ్యాను బోల్తా పడడంతో స్థానికులకు పంట పండింది. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యాన్ బోల్తాపడ్డ చోటికి పరుపరుగున వెళ్లిపోయారు. వ్యాన్ లో ఉన్న 3500 కిలోల ఉల్లిపాయలను ఎత్తుకెళ్ళిపోయారు.క్రిస్మస్ పండుగ వేళ శాంతాక్లాజ్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉల్లిపాయల్ని పట్టుకెళ్ళిపోయారు.హైవే పక్కనే వున్న కమలాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారంతా సంచులు పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. వ్యాన్లో వున్నవారి యోగక్షేమాలను పట్టించుకోకుండా ఉల్లిపాయల్ని సంచిల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఈ ఉల్లిపాయల ఖరీదు 3లక్షల వరకూ వుంటుంది. అరగంటలో ఉల్లిపాయలు మాయం కావడంతో వ్యాన్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కమలాపూర్ గ్రామానికి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించటానికి వ్యాన్ డ్రైవర్ యత్నిస్తుండగా అదుపు తప్పిన వ్యాన్ కంట్రోల్ తప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్