**బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వన నిర్వహణ ను ప్రశంసించిన  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి***

 బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వన నిర్వహణ ను ప్రశంసించిన  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి


హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతం లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వనాన్ని  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి  సందర్శించి నిర్వాహణ పట్ల అటవీ శాఖ శ్రద్ధను ప్రశంసించారు. ఉదయమే సతీ సమేతంగా శ్రీమతి అనురాధ జోషి గారితో విచ్చేసిన చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఆర్ శోభ ప్రిన్సిపల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అండ్ HOFF తెలంగాణ  చంద్ర శేఖర్ రెడ్డి, అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ మరియు పి వెంకటేశ్వరులు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, హైదరాబాద్ స్వాగతం పలికి పార్క్ లోని వివిధ సదుపాయాలను చీఫ్ సెక్రటరీ గారికి చూపిస్తూ పార్కు నిర్వహణను వివరించారు. పార్క్ విజిటర్ జోన్ లో ఉన్న EEC సెంటర్, ఓపెన్ క్లాస్ జిం, యోగ షెడ్, నేచర్ క్యాంపు వివరాలను చీఫ్ సెక్రటరీ  నగరములో ఇలాంటివి ఉపయోగంగా ఉన్నాయిని,  చాల అద్భుతంగా నిర్వహిస్తున్నారాని వీరందరినీ కొనియాడారు. పార్కు నిర్వహణలో ప్రదర్శిస్తున్న శ్రద్ధను అటవీ శాఖను అభినందించారు। కన్సర్వేషన్ జోన్ లో ని వాచ్ టవర్ ఫై నుంచి పార్కు పచ్చదనాన్ని చూసి పర్యావరణానికి చేస్తున్న సేవలు అద్భుతమైనవి అని చీఫ్ సెక్రటరీ గారు కొనియాడారు. అనంతరం వాచ్ టవర్ సమీపాన ప్లాంటింగ్ రాతి బండ మధ్య జువ్వి మొక్కను నాటి ఆ మొక్క బండ ఫై కూడా చక్కగా పెరుగుతుందని అన్నారు. చీఫ్ సెక్రటరీతో పాటు  మురళీధర్ సివిల్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు పాల్గొని పార్కుకు తాను గత కొన్ని దశభాలుగా వస్తున్నానని। ఆనాడు ఈ ప్రాంతం ఒక బంజరు నేల అని నేడు అద్భుతమైన పచ్చదనం తో కళకళలాడుతుంది అని అందుకు అటవీ శాఖ కృషిని అభినందించారు. చీఫ్ సెక్రటరీ  కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ని పరిశీలనాత్మకంగా చూసి తెలంగాణ లో Eco డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్బన్ పార్కులను Eco పార్కులను అభివృద్ధి చేయుటకు వాటి నిర్వాహణకు స్వయంసమృద్ధి ఆర్ధిక వనరులను పుష్కలమైన అవకాశముందన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్