** *9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..!!**
*9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..!!
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని 9 ఏళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మండలంలోని కనుపర్తి అరుంధతీ యవాడ లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. 9 ఏళ్ల చిన్నారి కనపర్తి లోని నానమ్మ వద్ద ఉంటోంది. వీరి తల్లిదండ్రులు నెల్లూరులోని ఓ అపార్ట్మెంట్ లో స్వీపర్లుగా పనిచేస్తున్నారు.గురువారం సాయంత్రం చిన్నారి నానమ్మ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కాలనీ నుంచి గ్రామంలో కి వెళ్ళింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడియ పెట్టాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు గంట సేపు చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కి గురైన చిన్నారి ఏడుస్తూ గ్రామం నుంచి తిరిగి వచ్చిన నానమ్మకు తన పరిస్థితిని వివరించింది.ఈ క్రమంలో పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు కుమార్ ను గ్రామస్తులు పట్టుకొని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. నిందితుడిపై నిర్భయ చట్టం నమోదు చేసినట్లు సీఐ జి గంగాధర్ రావు తెలిపారు. మండలంలో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.
*దిశ చట్టం అమల్లో ఉండగా నిర్భయ చట్టం ఎందుకు పెడుతున్నారు? దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో నిందుతుడికి ఉరి శిక్ష పడుతుంది కదా?*
Comments
Post a Comment