**వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం**
*వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం*
*కర్నూలు జిల్లా:* కోడుమూరు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.
మరోసారి ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
వెంకటగిరి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలే ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
పార్టీలో మొదటినుంచి పనిచేసినవారికి కాకుండా కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు.
పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Post a Comment