**గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్**
గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
2019 డిసెంబర్ 31వ తేదీ. సంవత్సరం ఆఖరి రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా, సిఎం కేసిఆర్ మానస పుత్రికలైన గురుకులాల నిర్వహణ ఆయన ఆలోచన మేరకు గొప్పగా నడవాలన్న సంకల్పంతో మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురవి ఏకలవ్య పాఠశాలలో ఉదయం విద్యార్థులు ప్రార్థన చేసే సమయానికి అక్కడికి చేరుకుని ప్రార్థనలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్ సెల్యుట్ ను స్వీకరించారు. డిసెంబర్ 31వ తేదీ జన్మదినోత్సవం ఉన్న విద్యార్థినికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విద్యార్థులతో కలిపి హ్యాపీ బర్త్ డే పాటను పాడించారు. ఉదయం విద్యార్థులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో మంత్రి గారు కూడా వారితో కలిసి బాక్సింగ్ చేశారు. వారికొక ఉత్సాహాన్ని కల్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇచ్చిన నినాదం మేరకు పాఠశాలలోని ఆవరణను పచ్చదనంతో ఉంచాలని సూచించారు. సరైన రీతిలో పరిశుభ్రత లేదని గుర్తించి, రీజినల్ కో ఆర్డినేటర్ కు ఫోన్ చేసి మందలించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విషయంలోనూ, వారికి అందించే వసతుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేంది లేదని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే మాట వినని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కురవి ఏకలవ్య పాఠశాల యాజమాన్యం నేడు సంవత్సరపు చివరి రోజు సందర్భంగా విద్యార్థులకు పిక్నిక్ ఏర్పాటు చేయడంతో వారికి మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో మంత్రితో పాటు మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, స్థానిక నేతలు, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Post a Comment