**రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం**
*రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం*
*కడప:* రాజంపేట మండలం తప్ప వారి పల్లి సమీపంలో కడప చెన్నై హైవే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
బీఎండబ్ల్యూ కారు.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మృతి చెందిన చిన్నారిని, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.
Comments
Post a Comment