**అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు - చంద్రబాబు**
*అమరావతి*
*తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్*
అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు
తలోమాట మాట్లాడి రాజధాని ని నాశనం చేస్తున్నారు
రాష్ట్ర భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్నారు
ప్రభుత్వ కుట్రలు గమనించాలని 5కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా
అమరావతి ఎప్పటికీ ప్రజా రాజాధానే
రాజధాని కి లక్ష కోట్లు కావాలి అంటున్న మంత్రులకు సంపద సృష్టిపై అవగాహన లేదా
కనీస మౌలిక సూత్రాలు కూడా తెలియని విధంగా మాట్లాడుతున్నారు
భూ సమీకరణ వినూత్న ఆలోచన...
*సచివాలయం, కోర్టు ఇక్కడ నడుస్తుండగా పరిపాలన కు కొత్తగా డబ్బులెందుకు..*
*నిధులు లేవు అని చెప్పటం ఒక సాకు మాత్రమే*
*ఇప్పుడు తరలింపు కోసం అదనంగా డబ్బు ఖర్చుపెట్టాలి కానీ ఉన్న వాటిని వినియోగించుకోటానికి ఇబ్బందేంటి*
కావాలనే పదే పదే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు
నిన్నటి వరకూ ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు
కాదు 75శాతం వెనుకబడినవారున్నారని నిరూపిస్తే వెనక్కి తగ్గారు
తర్వాత ముంపు ప్రాంతమని మాట్లాడారు
అందుకనుగుణంగానే ముంచటానికి అనేక కుట్రలు పన్నారు
అదీ సాధ్యపడలేదు
అందుకే ఇప్పుడు డబ్బులు లేవని కొత్త రాగం అందుకున్నారు..
Comments
Post a Comment