**విశాఖ ఉత్సవ్**
విశాఖపట్నం నగరానికి వచ్చే పర్యటకులను రెండు రోజుల పాటు అలరించేందుకు... విశాఖ ఉత్సవ్ సిద్ధమైంది.
ఉత్సవ్‌లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు.
తొలి రోజున దేవిశ్రీప్రసాద్, రెండో రోజు ఎస్.ఎస్. తమన్ సంగీత విభావరులు ఉండనున్నాయి.
ఈ ఉత్సవ్‌కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారితో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు.
వేలాది మందితో బీచ్‌లో జరగబోయే కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి ఉత్సవ్ కాబట్టి... ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు.
విశాఖ ఉత్సవ్ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కేజీహెచ్ , కలెక్టరేట్, బీచ్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో విద్యుత్ వెలుగు జిలుగులు దర్శనమిచ్చాయి.
Comments
Post a Comment