ఖాకీ కామం: ***

ఖాకీ కామం: 


కంచే చేను మేసేందుకు ప్రయత్నిస్తే అనే సామెతను వింటుంటాం కదా? కాపాడాల్సిన ఖాకీనే కాటు వెయ్యడానికి ప్రయత్నిస్తే.. ఇటువంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఓ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్‌లో పనిచేసే మహిళ కానిస్టేబుల్‌ను అదే స్టేషన్‌కు చెందిన ఓ ఎస్ఐ లైంగిక వేధింపులకు గురిచేశాడు.
తన కోరిక తీర్చాలంటూ, అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు. తరుచూ ఆమెకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. న్యూడ్ చాట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. తాను అలాంటి దాన్ని కాదని, తన జోలికి రావద్దంటూ సదురు బాధితురాలు మొర పెట్టుకున్నా ఎస్ఐ వినిపించుకోలేదు.
ఈ క్రమంలో బాధితురాలు అదే సబ్‌ డివిజన్‌కు చెందిన సీఐతో తన బాధ పంచుకుంది. తనను ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ ఆ కీచక ఎస్ఐని పిలిపించి చీవాట్లు పెట్టాడు. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. బాధను భరించలేక బాధితురాలు జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లింది.
దీనిపై విచారణ చేపట్టిన ఎస్‌పీ ఆ కీచక ఎస్‌ఐ వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించుకుని స్టేషన్‌ నుంచి వీఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇటీవల దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచనం అవ్వగా.. పోలీసులు మహిళలకు రక్షణగా నిలుస్తాం అని ప్రకటించారు. అటువంటిది పోలీసే ఇటువంటి పని చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్