** *ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి**
*ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*
ఏ.యం.అర్.పి. లో లెవల్ కెనాల్ (దిగువ కాలువ)నుండి పంపులు స్వీచ్ ఆన్ చేసి ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్
ద్వారా .65 టీ.యం.సి నీటిని 27 చెరువులు నింపడమే గాక,2.67 టీ.యం. సీ.నీటిని రబీలో 6 తడుల కు ఆన్ అండ్ ఆఫ్ (వార బంది) పద్దతి ద్వారా ఏప్రిల్ 4 వరకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పంటల పరిస్థితి,సాగు నీటి లభ్యత ననుసరించి నీటి విడుదల కొనసాగించ నున్నట్లు తెలిపారు .హై లెవెల్ కెనాల్ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాల రబీ ఆయకట్టు కు నీటి విడుదల కొనసాగుతోందని అన్నారు. ఏడు విడతలు వార బంధి పద్ధతిన ఏప్రిల్ మొదటి వరకు ఇవ్వడానికి ప్రణాళిక ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. నీటివిడుదల నీటి లభ్యత పంటల పరిస్థితి ని అనుసరించి నీటి విడుదల కొనసాగింపు చేయనున్నట్లు తెలిపారు.మంత్రి వెంట రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు నోముల నర్సింహయ్యా,కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు, ఏ.యం.అర్.పి.ఎస్.ఈ.సి.సాయి బాబా, ఈ ఈ సి.హెచ్. బుచ్చి రెడ్డి,డిప్యూటీ ఈ ఈ.లు బి. వెంకటేశ్వర్ రావు ,జి. విటలేశ్వర్, టింకు డే, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment