**గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త....**

గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త....


గుట్కా తినడం మానడం లేదనే కోపంతో కట్టుకున్న భార్యను సజీవ దహనం చేశాడు ఓ భర్త. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 2010లో ఈ ఘటన చోటుచేసుకోగా.. నిందితుడికి న్యాయస్థానం ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. అదనపు పీపీ రాము కథనం ప్రకారం.. మేడ్చల్‌ మండల కేంద్రానికి చెందిన పిట్ల కిరణ్‌, సుకన్యలకు 2010లో వివాహం జరిగింది. ఆటోడ్రైవర్‌గా పని చేసే కిరణ్‌ మద్యానికి, భార్య సుకన్య గుట్కాకు బానిసయ్యారు. అయితే గుట్కా తినడం మానేయాలని కిరణ్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. కానీ ఆమె భర్త మాటలను లక్ష్యపెట్టలేదు. ఈ క్రమంలో 2010 డిసెంబర్ 31న మరోసారి గుట్కా విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కిరణ్‌ భార్య సుకన్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేసి ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం కిరణ్‌పై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన సైబరాబాద్‌ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. కిరణ్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్