**అమరావతి: రాజధానిలో రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలు**
*అమరావతి: రాజధానిలో రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలు*
*అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారని, కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని రైతులు ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని రైతులు తెలపారు.
Comments
Post a Comment