**యూపీ పోలీసులే విధ్వంసకారులు సినీ నటి స్వరాభాస్కర్**
యూపీ పోలీసులే విధ్వంసకారులు
సినీ నటి స్వరాభాస్కర్
పౌరసత్వ చట్ట సవరణ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ వ్యతిరేక ఉద్యమంలో ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరుపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పథకం ప్రకారమే ఆందోళనకారులను ప్రజానీకం దృష్టిలో ఒంటరి చేసేందుకు ఆ విధ్వంసానికి పాల్పడి నాటకాలు ఆడుతున్నారని వర్తమాన సినీ నటి స్వరాభాస్కర్ వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులపై వ్యతిరేకత వచ్చేందుకు పోలీసులే ప్రజల ఆస్తులను పెద్దఎత్తున ధ్వంసం చేసినట్టు ఆమె విమర్శించారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళకారులు సంయమనం పాటిస్తూ పోరాటం చేస్తున్నారని వివరించారు.అయినా, ప్రభుత్వ వారిపై తప్పడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుడి హక్కు అని ఆమె గుర్తు చేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోడీ సర్కార్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆందోళనకారులు చెబుతున్నట్టు రాజ్యాంగ ఉల్లంఘన నిజం కాదా?
అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి కీలక సమయాల్లోనే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల విధ్వంసంపై న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా స్పందించి నిష్పక్ష విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముందు స్వరా భాస్కర్ సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో తన నిరసన తెలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకి సంఘీభావం పలికారు.
Comments
Post a Comment