**రాజధాని మహిళల ఆగ్రహం... సీఐ, ఎస్సైకి గాయాలు**
*రాజధాని మహిళల ఆగ్రహం... సీఐ, ఎస్సైకి గాయాలు*
వెలగపూడిలో రైతుల ఆందోళన ఓ వాహనంపై ఆందోళనకారుల దాడిఅడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
ఏపీ రాజధాని అమరావతి అట్టుడుకుతోంది.
రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఇక్కడి రైతులు,
వారి కుటుంబసభ్యులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
తాజగా వెలగపూడిలో నిర్వహిస్తున్న రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది. రైతులు ఆందోళన చేస్తుండగా,
అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని రాజధాని మహిళలు చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి.
మహిళలను,ఇతర ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ సీఐ, ఎస్సై గాయపడ్డారు.
తాము చేసిన త్యాగాలకు విలువ ఇవ్వకుండా రాజధానిని మార్చుతారా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
Comments
Post a Comment