**తొలిసారిగా రష్మీతో తన రిలేషన్ ని బయటపెట్టిన సుధీర్....!!**

తొలిసారిగా రష్మీతో తన రిలేషన్ ని బయటపెట్టిన సుధీర్....!!


బుల్లితెర షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు అనే చెప్పాలి. ఇక ఆ షో ప్రసారం అవుతున్న ఈటివి ఛానల్ వారికి అత్యధిక స్థాయిలో రేటింగ్స్ అందిస్తుండడంతో పాటు, యూట్యూబ్ లో కూడా భారీగా వ్యూస్ ని కురిపిస్తోంది. ఇకపోతే ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజిషియన్ గా పనిచేసిన సుధీర్, తన స్నేహితుడి సహాయంతో హైదరాబాద్ చేరుకొని, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం, దాని అనంతరం జబర్దస్త్ షో లో చిన్న ఛాన్స్ సంపాదించారు. అయితే మెల్లగా తన టాలెంట్ తో ఆ షోలో ఎదిగిన సుధీర్, ఇటీవల తన పేరుతో ఏకంగా సుడిగాలి సుధేర్ పేరుతో ఒక టీమ్ ని కూడా ఏర్పరుచుకుని ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్,
క్రేజ్ దక్కించుకున్నాడు.
యాంకర్ రష్మీ గౌతమ్ కూడా అదే షో ద్వారా యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఒకానొక సందర్భంలో ఆ షోలోని ఒక స్కిట్ లో భాగంగా రష్మీకి, సుధీర్ కు పెళ్లి జరుగుతుంది. ఇక అక్కడి నుండి వారిద్దరి మధ్య ఏదో ఉందని, తప్పకుండా వారు అతి త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ ఇప్పటివరకు కూడా పలు పుకార్లు ప్రచారం అవుతూనే ఉన్నాయి. మా మధ్య అటువంటిది ఏమి లేదని వారిద్దరూ ఎన్ని సార్లు వాటిని ఖండించిఅప్పటికీ కూడా అవి ఆగలేదు. ఇక ప్రస్తుతం సుధీర్ తొలిసారిగా వెండితెరపై నటిస్తున్న తొలి సినిమా 'సాఫ్ట్ వేర్ సుధీర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా, నిన్న ఫ్యాన్స్ తో తన జీవిత విశేషాలు షేర్ చేసుకున్న సుధీర్, తన జన్మ కారకులైన తల్లితండ్రులకు, మరియు తన ఎదుగుదలకు కారణమైన జబర్దస్త్ టీమ్ కు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
ఇక ఈవెంట్ మధ్యలో అందరూ కూడా రష్మీ అని అరుస్తుండడంతో, ఆమె గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు సుధీర్. నిజానికి రష్మీ గారితో తనకు స్నేహితురాలిగా ఎంతో మంచి అనుబంధం ఉందని, జీవితంలో ఎన్నో ఎత్తు, పల్లాలు చూసిన ఆమె తనకు ఎంతో ఆదర్శం అని అన్నాడు. నిజానికి ఆవిడ ఈ షోకు రావలసి ఉందని, అయితే అనుకోని ఒక ప్రోగ్రాం కారణంగా రాలేకపోయారని, అయినప్పటికీ తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారని అన్నాడు. ఇక కాసేపటి తరువాత ఆమె కోసం సరదాగా ఒక పాట కూడా పాడిన సుధీర్, తనకు ఇన్స్పిరేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చాడు.....!!


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్