**పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. పెళ్లి చేయాలని పీఎస్‌లో యువతి హల్‌చల్..**
పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. పెళ్లి చేయాలని పీఎస్‌లో యువతి హల్‌చల్..
హైదరాబాద్‌లోని బాబుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని పట్టుబట్టింది. పోలీస్ స్టేషన్‌లో వస్తువులను కిందపడేసింది. తలను గోడకు బాదుకుంటూ.. బయటకు పరుగులు తీస్తూ పోలీసులను తిప్పలు పెట్టింది. చివరకు సదరు ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పడంతో శాంతించింది.
వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి(22)కి కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లోని ఓ టెక్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్‌తో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుందామని చెప్పింది. అయితే అతను వివాహితుడు కావడంతో ఆ యువతితో మాట్లాడటం మానేశాడు.దీంతో బుధవారం నేరుగా బాచుపల్లిలోని అతనికి నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మీ అబ్బాయితో పెళ్లి జరిపించాలని ఇంట్లో గొడవ చేసింది.
అసలేం జరుగుతుందో తెలియక ఆ వృద్ద దంపతులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆ యువతితో పాటు అతని తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతనితో తనకు పెళ్లి చేయాలని లేకపోతే చనిపోతానని బెదిరించింది. పోలీస్ స్టేషన్‌లో వస్తువులను చిందర వందరగా పడేసింది. తలను గోడకు బాదుకుని ఏడ్చింది. చివరకు అతన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పడంతో ఆమె శాంతించింది.
Comments
Post a Comment