**మానస కేసులో చార్జిషీట్ దాఖలు**
మానస కేసులో చార్జిషీట్ దాఖలు
అత్యాచారం, హత్యకు గురైన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్.. నవంబర్ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్‌ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు.కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్‌స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు.
Comments
Post a Comment